Tollywood: మంచు విష్ణు క‌ష్టానికి త‌గ్గ‌ట్టు మా స్ర్కిప్ట్: శ్రీ‌నువైట్ల

Tollywood: మంచు విష్ణు- శ్రీ‌ను వైట్ల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఢీ చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో తెలిసిన విష‌యమే. మ‌ళ్లీ వీరి కాంబినేష‌న్‌లోనే డ‌బుల్ డోస్ చిత్రం తెర‌కెక్కుతుంది. కాగా తాజాగా ఈ చిత్రంపై ద‌ర్శ‌కుడు శ్రీ‌నువైట్ల ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశాడు. ఢీ చిత్రం త‌ర్వాత ఇన్నాళ్ల‌కు మా ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో డబుల్ బోస్ చిత్రం తెర‌కెక్కుతుంద‌ని.. ఈ సినిమా కోసం మంచు విష్ణు ఏ స్థాయిలో క‌ష్ట‌ప‌డుతున్నాడో విష్ణు ఫోటోలు పోస్ట్ చేస్తూ..

vishnu

Tollywood మా సినిమా కోసం క‌మిట్మెంట్‌తో హార్డ్ వ‌ర్క్ చేస్తున్న మా హీరో విష్ణుకు.. అంతే స్థాయిలో ఈ చిత్ర క‌థ కూడా రెడీ చేస్తున్నాం. మా సమిష్టి కృషికి ఖ‌చ్చితంగా మంచే జ‌రుగుతుంది అని శ్రీ‌నువైట్ల పెట్టారు. ఇక వ‌రుస ప్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న డైరెక్ట‌ర్ శ్రీ‌నువైట్ల‌.. అలాగే మంచు విష్ణు సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. Tollywood ఈ నేప‌థ్యంలోనే వీరి కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం కోసం క‌సిగా వ‌ర్క్ చేస్తున్నారు.