డోనాల్డ్ ట్రంప్ కి కరోనా పాజిటివ్.. రెండవ డిబేట్ లో పాల్గొంటారా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి రగులుతున్న సమయంలో ఊహించని విధంగా డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ కరోనా భారిన పడ్డారు. ఇటీవల వారికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ట్రంప్ సోషల్ మీడియా ద్వారా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక్కసారిగా ఈ వార్త అమెరికా ప్రజలను షాక్ కి గురి చేసింది.

74ఏళ్ల ట్రంప్ సడన్ గా కరోనా భారిన పడడంతో ఆయన వెంటనే క్వారంటైన్ లోకి వెళ్లారు. ఆయన సలహాదారు హోప్ హిక్స్‌కు కరోనా సోకిన కొన్ని గంటల్లోనే.. ట్రంప్ దంపతులకు కూడా కరోనా నిర్ధారణ అయింది. ఇక ఆయన నెక్స్ట్ డిబేట్ లో పాల్గొంటారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రెండు రోజుల క్రితం ఒహాయోలోని క్లీవ్‌లాండ్‌లో తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌ జరిగింది.

అందులో ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌తో పోటాపోటీగా చర్చల్లో పాల్గొన్నారు. ఇక నెక్స్ట్ డిబేట్ ఈ నెల 17న జరగనుంది. అయితే ట్రంప్ 15రోజుల వరకు తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాల్సిందే. మరి ఆయన ఆ చర్చల్లో పాల్గొంటారా లేదా అనేది సందేహంగా మారింది. కరోనా వైరస్ భారిన పడి ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా తగ్గిందని చాలా మంది ఆ వైరస్ ని లైట్ తీసుకుంటున్నారు. అలా కాకుండా మరికొన్ని రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని TFPC కోరుకుంటోంది.