ప్రాణహాని ఉంది.. క్యాబ్ డ్రైవర్ పై ముమైత్ ఖాన్ సంచలన ఆరోపణలు

కొన్ని రోజుల క్రితం, హైదరాబాద్ కి చెందిన క్యాబ్ డ్రైవర్, ప్రముఖ డ్యాన్సర్ ముమైత్ ఖాన్ డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గోవా ట్రిప్ కోసమని తీసుకెళ్లి డబ్బు చెల్లించకుండా తనను మోసం చేసిందని క్యాబ్ డ్రైవర్ చెప్పగా ఇప్పుడు ముమైత్ ఖాన్ క్యాబ్ డ్రైవర్‌పై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు చేసిన తరువాత మీడియాతో సంభాషించిన ముమైత్, క్యాబ్ డ్రైవర్ తనపై తప్పుడు ఆరోపణలు చేశాడని మరియు అతను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని అలాగే అతని నుండి తనకు ప్రాణానికి ముప్పు ఉందని చెప్పింది. టోల్ ఫీజుతో సహా గోవా యాత్రకు పూర్తి ఛార్జీలు చెల్లించానని ముమైత్ స్పష్టం చేశారు. గత 12 సంవత్సరాలుగా తాను చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నానని, పరిశ్రమలోని ప్రతి ఒక్కరికి తన ప్రవర్తన గురించి బాగా తెలుసునని ఆమె చెప్పింది.