కోరిక తీరిస్తేనే అవకాశాలు ఇస్తానన్న సౌత్ డైరెక్టర్

అవకాశాల కోసం హీరోయిన్లపై డైరెక్టర్లు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలు ఇప్పటికీ ఎన్నో బయటపడ్డాయి. దీనిపై ‘మీటూ’ పేరుతో పెద్ద ఉద్యమం జరుగుతోంది. దీని ద్వారా హీరోయిన్లు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్నారు. తాజాగా హిందీ నటి డోనాల్ బిష్ట్ తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

donal bhist

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో సినిమా అవకాశాల కోసం ఒక సౌత్ డైరెక్టర్ దగ్గరికి వెళ్లానని, ఛాన్స్ ఇస్తానని చెప్పి ఒక రాత్రి గడపాలని కోరాడని డోనాల్ బిష్ట్ బయటపెట్టింది. వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశానంది. అవకాశాల కోసం అంత నీచానికి పాల్పడే వ్యక్తిని తాను కాదని, టాలెంట్‌తోనే సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నానంది. తన ప్రతిభ ద్వారానే తనకు మంచి గుర్తింపు వచ్చిందని, అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయంది.

ఇక ప్రారంభంలో ఒక షో కోసం సెలక్ట్ చేశారని, డేట్స్ ఇచ్చి రెమ్యూనరేషన్ కూడా ఫైనల్ చేసిన తర్వాత ప్రాజెక్టు నుంచి తప్పించారని చెప్పింది. ఈ సంఘటనతో ఇండస్ట్రీ, ముంబై జనాలు అంటేనే అబద్ధం, నకిలీ అనే ఫీలింగ్ వచ్చిందని డోనాల్ బిష్ట్ చెప్పింది. నటన అంటే తనకు పిచ్చి అని, ఆడిషన్లకు వెళ్లడం కూడా మానలేదని తెలిపింది.