ఐశ్వర్యారాయ్ పెళ్లి చీర ధర ఇప్పుడు ఎంతో తెలుసా?

ప్రపంచసుందరి, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ గురించి తెలియని వారు అసలు ఎవరూ ఉండరు. పెళ్లై పిల్లలున్నా ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కూడా ఆమెను ఎంతోమంది అభిమానిస్తున్నారు. 2007 ఏప్రిల్ 20న బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఎన్నో సినిమాల్లో అభిషేక్, ఐశ్వర్య కలిసి నటించారు. అప్పుడు వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారడంతో చివరికి కుటుంబ సభ్యులను ఒప్పంచి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీరి పెళ్లి వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది.

aishwarya rai marraige saree

ప్రస్తుతం బెస్ట్ కఫుల్స్‌గా వీరిద్దరు కొనసాగుతున్నారు. అయితే అప్పట్లో జరిగిన ఆ పెళ్లిలో ఐశ్వర్యరాయ్ కట్టుకున్న పెళ్లి చీర గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా ఈ చీరను డిజైన్ చేయగా.. క్రిస్టల్, నిజమైన గోల్డ్ పోగుల్ని ఇందులో ఉపయోగించారు. అప్పట్లో దీని విలువ రూ.75 లక్షలు అయింది. పెళ్లిలో ఆ చీర ధరించి దేవకన్యలా ఐశ్వర్యరాయ్ కనిపించింది. ఆ చీరలో ఆమెను చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు.

కానీ ప్రస్తుతం ఐశ్వర్య పెళ్లి చీర ధర రూ .50 కోట్లకు పైగా పలుకుతుందట. అప్పటికీ, ఇప్పటికీ గోల్డ్ ధర బాగా పెరగడం, చీరకు ఉపయోగించే వస్తువుల ధరలు కూడా పెరగడంతో ఐశ్వర్య అప్పట్లో ధరించిన చీర ధర ఇప్పుడు పెరిగిందట. ఐశ్వర్య పెళ్లి చీర ఇప్పుడు కోట్లకు చేరుకోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే.