ఉదయ్ కిరణ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సినిమాకు సీక్వెల్?

టాలీవుడ్ ఆడియెన్స్ ఎప్పటికి మరచిపోలేని యువ హీరోల్లో ఉదయ్ కిరణ్ ఒకరు. లవర్ బాయ్ గా యూత్ లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా మంచి క్రేజ్ అందుకున్న ఉదయ్ కిరణ్ జీవితం అర్దాంతరంగా ముగిసిపోవడం అందరిని షాక్ కి గురి చేసింది. అయితే ప్రస్తుతం అతని కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాకు సీక్వెక్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఆ సినిమా మరేదో కాదు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సినిమా. 2000వ సంవత్సరంలో వచ్చిన ఆ సినిమా ఏ స్థాయిలో హిట్టయ్యిందో స్పెషక్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు దర్శకుడు తేజ చిత్రం 2 అంటూ కొత్త తరహా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. పూర్తిగా అందులో కొత్త నటీనటులు కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆ సినిమాను థియేటర్స్ లో కాకుండా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం.