RRR: ఇదుగో ఇత‌డే నా ధైర్యానికి ప్ర‌తీక‌: డైరెక్ట‌ర్ రాజ‌మౌళి

RRR: ఆర్ఆర్ఆర్ నుంచి మెగాస్టార్ రాంచ‌ర‌ణ్ కొత్త పోస్ట‌ర్‌ను కొద్ది సేప‌టి క్రిత‌మే రిలీజ్ చేశారు. దీంతో సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ రేపు మార్చి 27న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా.. ఒక్క‌రోజు ముందే ఈ స‌రికొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసి మెగాభిమానుల్లో సంద‌డిని నెల‌కొల్పారు.

RRR New Poster

అల్లూరి సీతారామ‌రాజుగా రాంచ‌ర‌ణ్ ఉగ్ర‌రూపాన్ని చూపించ‌బోతున్న‌ర‌నే విష‌యం ఈ పోస్ట‌ర్ చూస్తే అర్థం అవుతుంది. రాంచ‌ర‌ణ్ కొత్త‌ పోస్ట‌ర్‌పై ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి స్పందిస్తూ.. ధైర్యం, ఆత్మ‌గౌర‌వం, ప‌రిపూర్ణ‌త క‌లిగిన వ్య‌క్తి. ఇదిగో ఇత‌డే నా అల్లూరి సీతారామ‌రాజు అంటూ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు. ప్ర‌స్తుతం ఈ మ‌హోగ్ర‌రూపమైనా అల్లూరి సీతారామ‌రాజు పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.