Nagarjuna: వైల్డ్ డాగ్ స‌రికొత్త టీజ‌ర్‌ను రిలీజ్ చేసిన నాగ్‌..

Nagarjuna: అక్కినేని నాగార్జున న‌టించిన తాజా చిత్రం వైల్డ్ డాగ్‌. అహిషోర్ సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో.. సయామీ ఖేర్‌, దియా మీర్జా, అతుల్ కుల్‌క‌ర్ణి, అలీ రెజా త‌దిత‌రులు న‌టించారు. గ‌తంలో హైద‌రాబాద్‌లో జ‌రిగిన బాంబు పేలుళ్ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా… ఈ చిత్రానికి సంబంధించి స‌రికొత్త టీజ‌ర్‌ను నాగార్జున త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు.

Wilddog Teaser

ఇందులో టెర్ర‌రిస్టుల కోసం భారీగా ఖ‌ర్చు పెడుతున్నార‌ని తెలియ‌జేస్తూ.. మీరు దీన్ని అంగీక‌రిస్తారా.. నేను మాత్రం ఒప్పుకోను అంటూ నాగ్ చెప్పే డైలాగ్ ఎంతో అల‌రిస్తోంది. ఇక ఈ చిత్రంలో నాగ్ నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ ఏజెంట్ విజ‌య్ వ‌ర్మ‌గా నాగార్జున క‌నిపించ‌నున్నారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ భాగంగా ఈ స‌రికొత్త టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.