ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని అభినంధించిన దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్ శంకర్!

దర్శకుల సంగం అధ్యక్షుడు ఎన్ శంకర్ “ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్” నూతన కార్యవర్గం ఏర్పడిన సందర్భంగా అధ్యక్షుడు ఎ. ప్రభు, ప్రధాన కార్యదర్శి పర్వతనేని రాంబాబును మరియు కమిటీ సభ్యులను తన దర్శకుల సంఘం కార్యాలయంకు పిలిసి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. ముఖ్యంగా నేను బిగినింగ్ స్టేజ్ లో వున్నప్పుడు వారితోనే రూమ్ షేర్ చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలా అందరితో నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సినీ పరిశ్రమలో జర్నలిస్టుల కృషి ఎంతో మరువలేనిది. పొద్దున లేచిన దగ్గర నుండి నైట్ వరకు సినిమా కవరేజ్ లు చేస్తుంటారు.

వారందరూ ఇండస్ట్రీకి సంబంధించిన వారే.. అలాంటి వారికి ఎలాంటి సదుపాయాలు లేకపోవడం శోచనీయం. నా వంతుగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులందరికీ ఏవిధమైన సహాయ, సహకారాలు కావాలన్నా.. ప్రభుత్వ పరంగా నేను అండగా ఉండి.. మంచి జరిగేలా చూస్తాను. అసోసియేషన్ సభ్యులందరూ కలసి పని చేస్తే.. ఇండస్ట్రీ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ అన్నీ వసతులు లభిస్తాయి.. నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు అని అన్నారు.