మంచి స్టఫ్ ఉన్న డైరెక్టర్ చేతిలో నితిన్ అంధాదున్ రీమేక్

ఏ భాషలో హిట్టైనా తెలుగులో రీమేక్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఆయుష్మాన్ ఖురానా నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ అంధాదున్ కూడా ఈ లిస్ట్ లోకే చేరుతుంది. 2018లో ఆయుష్మాన్, టబు, రాధికా ఆప్టే నటించిన ఈ మూవీ సినీ అభిమానులని మెప్పించింది. థ్రిల్లర్ జానర్ లో వచ్చిన అంధాదున్ సినిమాని శ్రీరాం రాఘవన్ డైరెక్ట్ చేశారు. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీల్లో అంధాదున్ సినిమాకి నేషనల్ అవార్డులు వచ్చాయి.

టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన అంధాదున్ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి నితిన్ ప్లాన్స్ వేస్తున్నాడు. సుధాకర్ రెడ్డి, అంధాదున్ సినిమా రీమేక్ రైట్స్ కొని చాలా రోజులే అయ్యింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా కూడా ఈ ప్రాజెక్ట్ కి సుధీర్ వర్మ దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి సినిమాకే టెక్నీకల్లి స్టఫ్ ఉన్న డైరెక్టర్ గా పేరున్న సుధీర్ వర్మ లాంటి దర్శకుడి చేతిలో అంధాదున్ లాంటి స్క్రిప్ట్ పడితే మేకింగ్ పరంగా కన్ఫామ్ గా న్యాయం జరుగుతుంది. మరి నితిన్ తో సుధీర్ వర్మ చేస్తున్న తెలుగు అంధాదున్ ఎలా ఉండబోతోంది? ఎప్పుడు మొదలవుతుంది అనే విషయాలు తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.