అత్యంత విషమంగా ప్రముఖ నటుడి ఆరోగ్యం

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఆయన భార్య సైరా భాను తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని అందరూ ప్రార్థనలు చేయాలని ఆమె కోరారు. దీంతో దిలీప్ కుమార్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ఆరోగ్యం పరంగా దిలీప్ కుమార్ చాలా బలహీనంగా ఉన్నారని, కేవలం ఇంట్లో హాల్ నుంచి తన రూమ్‌ వరకు మాత్రమే నడవ కలుగుతున్నారని సైరా భాను తెలిపింది.

dilipkumar

ఆయన ఇమ్యూనిటీ లెవల్ చాలా తక్కువగా ఉందంది. ఆయన అంటే మాటల్లో చెప్పలేనంత ఆరాధ్య భావం ఉంటుందని, ఆయన తాకడం, ఆయనతో సన్నిహితంగా ఉండటమనే విషయాలు ప్రపంచంలోనే నాకు గొప్ప విషయాలు అని సైరా భాను చెప్పింది. ఆయనపై ఉన్న ప్రేమను పక్కన పెడితే.. ఆయనే నాకు ఆరాధ్యం, చివరి శ్వాస అని సైరా భాను అన్నారు. ఈ సంవత్సరం నాటికి దిలీప్ కుమా, సైరా భాను పెళ్లి చేసుకుని 54 సంవత్సరాలు అయింది.

ఈ క్రమంలో వివాహ వార్షిక వేడుకను జరుపుకోవాలని అనుకున్నారు. కానీ దిలీప్ కుమార్ సోదరులు మరణించడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. దిలీప్ కుమార్ సోదరులు ఎహసాన్ బాయ్, అస్లాం బాయ్ కరోనాతో మరణించారు. వారి మృతితో దిలీప్ కుమార్ విషాదంలోకి వెళ్లిపోయారు. కాగా దిలీప్‌కుమార్, సైరా భాను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. 1966లో వారిద్దరి వివాహం జరిగింది.