అన్నదాతలకు సెలబ్రెటీల మద్దతు

కేంద్ర ప్రభుత్వం కొత్తం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు చేస్తున్న ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. గత 14 రోజులుగా ఈ ఉద్యమం జరుగుతుండగా.. ఢిల్లీలోని అన్ని బోర్డర్స్‌ను రైతులు బ్లాక్ చేశారు. రేపు భారత్ బంద్‌కి రైతులు మద్దతు ఇవ్వగా.. రైతులకు ప్రతిపక్షాలు పూర్తి మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే ఐదు సార్లు కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలు జరగ్గా.. అవి సఫలం కాలేదు. దీంతో బుధవారం మరోసారి రైతులను కేంద్రప్రభుత్వం చర్చలకు పిలిచింది.

formers

ఈ ఉద్యమాన్ని పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు మద్దతు ప్రకటించారు. హీరోయిన్లు ప్రీతిజింటా, ప్రియాంక చోప్రా, నటుడు, సింగర్ దిల్జీత్, నటుడు సోనూసూద్, సోనమ్ కపూర్, రితేశ్ దేశ్ముఖ్, పరిణితి చొప్రా తమ మద్దతు ప్రకటించారు. ఇక సింగర్, నటుడు దిల్జీత్ ఢిల్లీలో రైతుల ఉద్యమంలో స్వయంగా పాల్గొని రైతులకు కోటి రూపాయలు ఇచ్చారు. రైతులు చలిలో ఉద్యమం చేస్తుండగా.. బట్టలు, బ్లాకెట్స్ కొనుక్కోవడానికి ఈ డబ్బులు ఇచ్చారు.

‘మన రైతుల భయాలను తొలగించాల్సిన అవసరం ఉంది. వారి ఆశలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యంగా, ఈ సంక్షోభం త్వరలోనే పరిష్కరించబడేలా చూడాలి అని దిల్జీత్ ట్వీట్ చేశాడు. ఇక “ఈ మహమ్మారి చలిలో నిరసన తెలిపిన రైతులు, వారి కుటుంబాలకు నా మద్దతు తెలుపుతున్నాం. ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలు ఫలించి త్వరలో సానుకూల ఫలితాలను వస్తాయని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను’ అని ప్రీతి జింటా ట్వీట్ చేసింది.