మ‌హేశ్ అందానికి కార‌ణం ఆమెనే!

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు అందంలో ఉన్న ఫాలోయింగ్ మ‌రే హీరోకి లేదు. కేవ‌లం అభిమానులే కాదు.. త‌న కోస్టార్స్‌తో పాటు ద‌క్షిణాది, ఉత్తారాది సినీ ప్ర‌ముఖులు కూడా మ‌హేశ్ అందానికి ఫిదా అయిన‌వాళ్లే. మ‌హేశ్ తొలి చిత్రం రాజ‌కుమారుడు చిత్రం నుండి మురారి, ఒక్క‌డు, అత‌డు ప‌లు చిత్రాల‌తో ఇండ‌స్ట్రీ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు. విభిన్న శైలిలో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను క్రియేట్ చేసుకున్నారు. అంతేకాకుండా సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ త‌న ఉదార‌త‌ను కూడా చాటుతుంటారు.

maheshbabu younglook

అయితే మ‌హేశ్ తొలి సినిమా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మ‌హేశ్ అందంలో పెద్ద‌గా తేడాలేవీ క‌నిపించ‌వు. సినిమా సినిమాకు కొత్త‌గా యంగ్ లుక్‌లో క‌నిపిస్తూ అభిమానుల‌ను ప‌లుక‌రిస్తుంటాడు మ‌హేశ్‌. కాగా మ‌హేశ్ ఇలా అంద‌మైన యంగ్ లుక్‌లో కనిపించ‌డానికి కార‌ణం ఓ వ్య‌క్తి. ఆమె డాక్ట‌ర్ ర‌ష్మీశెట్టి. ఈమె గురించి చెప్పాలంటే.. ర‌ష్మీశెట్టి సెల‌బ్రిటీ స్కిన్ స్పెష‌లిస్ట్‌(డెర్మటాల‌జిస్ట్‌). హైద‌రాబాద్‌, ముంబై సిటీల్లో ఎంతో మంది క్లైయింట్స్ ఉన్నారు. మ‌హేశ్ కూడా ఆమెకు క్లైయింట్‌.. ఈ క్ర‌మంలోనే మ‌హేశ్‌బాబును స్కిన్ టోన్‌ను కాపాడుతూ ఎప్ప‌టిక‌ప్పుడు మ‌హేశ్‌ను గైడ్ చేస్తూ స‌క్సెస్‌ఫుల్ జ‌ర్నీలో భాగ‌స్వామ్య‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే మ‌హేశ్‌బాబుకు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ.. మ‌హేష్‌తో దిగిన సెల్ఫీ ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది డా. ర‌ష్మీక శెట్టి. నాపై చూపిస్తున్న ప్రేమ‌కు నా మీద పెట్టుకున్న న‌మ్మ‌కానికి కృత‌జ్ఞ‌త‌లు అంటూ క్యాప్ష‌న్ పెట్టింది. ఇదిలా ఉండ‌గా.. ప్ర‌స్తుతం మ‌హేశ్ స‌ర్కార్ వారి పాట సినిమాలో న‌టిస్తున్నాడు. ఆ సినిమా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా.. ఇందులో మ‌హేశ్‌కు జోడీగా కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.