విజయ్ ‘మాస్టర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి హీరోగా వచ్చిన మాస్టర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఒక్క తమిళనాడులోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసినట్లు ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.

master ott release date

అయితే ఈ సినిమాను త్వరలో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. భారీ ధర చెల్లించి అన్ని భాషల డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ తాజాగా ప్రకటించింది.