పెళ్లి తర్వాత ఇదే మొదటిసారి

ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బయోపిక్స్ హవా సాగుతోంది. ఇదే జోష్ ని కొనసాగిస్తూ ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకి సహనిర్మాత అయిన విష్ణు ఇందూరి, ఇప్పుడు బాలీవుడ్ లో లెజెండరీ ఇండియా క్రికెటర్ కపిల్‌దేవ్ జీవితం ఆధారంగా 83 అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రణ్‌వీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ నటి దీపికాపదుకొనే రోమి దేవ్ పాత్రలో కనిపించనుంది. పెళ్లికి ముందు కలిసి నటించిన ఈ జంట, పెళ్లి అయిన తర్వాత రియల్‌లైఫ్ కపుల్ గా, రీల్‌లైఫ్‌ లో కలిసి నటించడం ఇదే మొదటిసారి.

83లో దీపికా పాత్ర నిడివి కేవలం 10 నుంచి 12 నిమిషాలు మాత్రమే ఉంటుందట, రీసెంట్ గా దీపికా తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసిందని సమాచారం. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 ఏప్రిల్ 10న గుడ్ ఫ్రైడే రోజున విడుదల చేయనున్నారు. మధు మంతెన, విష్ణు ఇందూరి, ఖాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పంకజ్ త్రిపాఠి, తాహిర్ ఆజ్ భాసిన్‌, సకీబ్ సలీమ్, చిరాగ్ పటిల్‌, అదినాథ్ కొఠారే, ధైర్య కర్వా, దినకర్ శర్మ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.