ఈసారి అయినా రిలీజ్ అవుతుందా?

నాగ చైతన్య- తమన్నా ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం 100% లవ్. ఇదే మూవీని సుకుమార్, తన అసిస్టెంట్ ని డైరెక్టర్ చేసి తమిళంలో రీమేక్ చేస్తున్నాడు. 100% కాదల్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో జీవి ప్రకాశ్ కుమార్, షాలిని పాండే లీడ్ రోల్స్ ప్లే చేశారు. చాలా రోజులుగా పోస్టర్స్ తో ఆకట్టుకున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. తెలుగు వెర్షన్ కి పెద్దగా మార్పులు చేయకుండా తెరకెక్కిన 100% కాదల్, కోలీవుడ్ లో కూడా మంచి విజయం సాదిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అనేక కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. టీజర్ రిలీజ్ చేసిన ఏడాది తర్వాత ట్రైలర్ విడుదల చేసిన చిత్ర యూనిట్, సినిమా రిలీజ్ డేట్ త్వరలో ప్రకటిస్తామని అంటున్నారు. మరి ఈసారి అయినా అనుకున్న టైంకి 100% కాదల్ విడుదలవుతుందేమో చూడాలి.