ఓటీటీకి సిద్దమవుతున్న రానా`విరాట పర్వం’

కరోనా సెకెండ్ వేవ్ కారణంగా థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ ఆగిపోయాయి. దీంతో గతేడాది లాగే ఈ ఇయర్ కూడా ఈ ఏడాది కూడా చిన్నా పెద్దా సినిమాలన్నీ ఆగిపోయాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు ఆన్ లైన్ లో స్ట్రీమ్ అవ్వగా, మరి కొన్ని సినిమాలు మాత్రం థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తాం అంటూ మేకర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మాత్రం మార్పు లేకపోవడంతో ధియేటర్ లోనే రిలీజ్ అవుతాయి అనుకున్న పెద్ద సినిమాలు కూడా ఒటిటి బాటలోకి వచ్చాయి. ఈ లిస్టులో చేరనున్న క్రేజీ మూవీ ‘విరాట పర్వం’.

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాట పర్వం చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా అడ్డపడటంతో.. విడుదల వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ చిత్రాన్ని భారీ రేటుకు ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఇదే నిజమైతే.. త్వరలోనే విడుదల తేదీపై ప్రకటన వస్తుంది.