ప్రణిత తమ్ముడి ఎంట్రీ… ఎన్టీఆర్ అండ ఉంటుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి కొత్త హీరో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఎన్టీఆర్ వైఫ్ ప్రణితకి ఒక తమ్ముడు ఉన్నాడు. ప్రముఖ పారిశ్రామిక వేత్త నార్నే శ్రీనివాస రావు కుమారుడైన నితిన్ చంద్ర, త్వరలోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నితిన్‌ని హీరోగా పరిచయం చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా వస్తున్న ఈ వార్త ఫిలిం నగర్ అంతా చక్కర్లు కొడుతూ ఉంది. డైరెక్టర్ తేజ నితిన్ చంద్రని ‘చిత్రం’ సీక్వెల్‌ ‘చిత్రం2’తో లాంచ్‌ చేయాలని భావిస్తున్నట్లు టాక్ నడించింది. కానీ ఆ ప్రాజెక్ట్ వర్క్ ఔట్ అవ్వలేదు, పట్టలెక్కకుండానే ఆగిపోయింది. తాజా సమాచారం మేరకు రీసెంట్‌గా ఓ పేరున్న దర్శకుడు చెప్పిన కథకు నితిన్ చంద్ర గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారనే ప్రచారాలు వినిపిస్తున్నాయి, అయితే నితిన్ చంద్రకి బావ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? ఎంతగా నితిన్ చంద్రని ముందుండి ప్రమోట్ చేస్తాడు అనేది చూడాలి.