భాయ్ కో స్వాగత్ కరో

దబాంగ్, చుల్ బుల్ పాండేగా సల్మాన్ ఖాన్ చేసిన యాక్టింగ్ సినిమాకే హైలైట్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకి సీక్వెల్ గా మూడో పార్ట్ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ విలన్ గా నటిస్తున్నారు. తెలుగు తమిళ హిందీ భాషల్లో దబాంగ్ 3 డిసెంబర్ 20 దబాంగ్ 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన సల్మాన్ ‘చుల్ బుల్ పాండే ఈజ్ బ్యాక్’ అంటూ ప్రమోషనల్ వీడియో ఒకటి వదిలారు. డిసెంబర్ 20కి మాకు స్వాగతం చెప్పండి అంటూ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.