అసలైన బోనాల జాతర ఇప్పుడే మొదలయ్యింది

పూరి జగన్నాధ్, రామ్ పోతినేని కలయికలో వచ్చిన మొదటి సినిమా ఇస్మార్ట్ శంకర్. రిలీజ్ కి ముందు అసలు అంచనాలు లేని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టించింది. రామ్ ఎనర్జీకి పూరి మార్క్ కలవడంతో బీ సీ సెంటర్స్ లో ఆడియన్స్ రిపీటెడ్ సినిమా చూశారు. అన్ని సెంటర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన 60 రోజుల తర్వాత ఇస్మార్ట్ శంకర్ వీడియో సాంగ్స్ ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో ముందుగా దిమాక్ ఖరాబ్ వచ్చి 20 మిలియన్ వ్యూస్ రాబట్టగా, తాజాగా ఈ లిస్ట్ లో బోనాల సాంగ్ కూడా చేరింది. మణిశర్మ ఇచ్చిన మాస్ బీటుకి రాహుల్ సిప్లిగంజ్ తన వాయిస్ తో ఫుల్ జోష్ నింపాడు. నభా నటేష్, రామ్ పోతినేనిలు దుమ్ము లేచి పోయే డాన్సులు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సంబరం జరుగుతున్న ఈ సమయంలోనే వీడియో సాంగ్ కూడా రావడంతో యూత్ అంతా ఈ సాంగ్ ని డీజే చేసి ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి.