Sachin Tendulker: మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్‌కు క‌రోనా!

Sachin Tendulker: భార‌త్‌లో క‌రోనా వైర‌స్‌ మ‌రోసారి విజృంభిస్తుంది. ఈ నేప‌థ్యంలో భారీ ఎత్తున కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో మ‌హారాష్ట్ర‌లో అయితే భారీగా క‌రోనా కేసులు న‌మోదవుతున్నాయి. దీంతో సామాన్యుల నుంచి ప్ర‌ముఖులు కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్‌, మ‌నోజ్ బాజ్‌పేయ్‌, కార్తిక్ ఆర్య‌న్‌, మిలింద్ సోమ‌న్‌, ఆర్ మాధ‌వ‌న్ వంటి న‌టులు క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే.

Sachin tendulker

ఇక తాజాగా బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు ప‌రేశ్ రావెల్ క‌రోనా బారిన ప‌డ్డారు. అలాగే భార‌త మాజీ లెజండ‌రీ క్రికెట‌ర్ మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ తెండూల్క‌ర్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలుపుతూ.. నాకు ఈ రోజు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఇంట్లోని మిగ‌తా వారికి నెగెటివ్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం నేను హోంక్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల సూచ‌న‌ల మేర‌కు క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తున్నాన‌ని ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు స‌చిన్‌.