Powerstar: డ‌బ్బింగ్ కంప్లీట్ చేసిన‌ వ‌కీల్‌సాబ్‌.. ఆ తర్వాత‌ చిత్ర‌బృందంతో ఫోటో !

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ న‌టించిన తాజా చిత్రం వ‌కీల్‌సాబ్‌. ఈ చిత్రం విడు‌దల‌కు సిద్ధం అవుతున్న నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టారు చిత్ర‌బృందం. ఈ చిత్రం ఉగాది కానుక‌గా ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల మందుకు రానుంది. బాలీవుడ్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ పింక్ చిత్రానికి ఇది రీమేక్‌గా వ‌స్తున్న ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

vakeelsaab

దిల్ రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, ప్ర‌కాశ్ రాజ్‌, అంజ‌లి, నివేధా థామ‌స్‌, అన‌న్య నాగేళ్ల త‌దిత‌రులు న‌టించారు. కాగా వ‌కీల్ సాబ్ కోసం ప‌వ‌న్ త‌న పాత్ర‌కు డబ్బింగ్‌ను పూర్తి చేసిన అనంత‌రం డైరెక్ట‌ర్ శ్రీ‌రామ్ వేణుతో స‌హా ప‌లువురు టీమ్‌తోPowerstar ప‌వ‌న్ ఫోటో దిగారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.