Comedian Ali: హీరోయిన్‌ను న‌లిపేస్తున్న అలీ..

Comedian Ali: టాలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్ న‌టిస్తున్న చిత్రం అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి. ఈ చిత్రాన్ని అలీవుడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై అలీ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌పురం కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రాన్ని అలీబాబా, కొణ‌తాల మోహ‌న్‌, శ్రీ‌చ‌ర‌ణ్ నిర్మిస్తుండ‌గా.. ఇందులో న‌రేశ్ మ‌రో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈయ‌న‌కు జోడీగా ప‌విత్ర లోకేశ్ న‌టిస్తుంది. అలాగేComedian Ali అలీ స‌ర‌స‌న మౌర్యాని హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Aliwood Entertainments

కాగా ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ 90శాతం కంప్లీట్ చేసుకోగా.. ఇటీవ‌లే ఈ చిత్రంలోని నా గుండె చిక్కుకుంది అనే సాంగ్‌ను కాశ్మీర్‌లోని ప‌లు లొకేష‌న్ల‌లో ఆరు రోజుల పాటు చిత్రీక‌రించామ‌ని చిత్ర‌బృందం వెల్ల‌డించింది. ఈ సాంగ్ రొమాంటిక్‌గా ఉంటుంద‌ని తెలిపారు. ఇక ఈ చిత్రం మ‌లయాళంలో హిట్ అయినా వికృతికి రీమేక్‌గా ఇది తెర‌కెక్కుతుండ‌గా.. మ్యూజిక్ మ్యాస్ట్రో ఏ ఆర్ రెహ‌మాన్ ద‌గ్గ‌ర ప‌నిచేసిన రాకేశ్ ప‌ళిదం ఈ చిత్రానికి స్వ‌రాలు అందిస్తున్నారు.