Tollywood: త‌న ఆఫీసు నుంచి కో డైరెక్ట‌ర్‌ను గెంటేసిన అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌.. త‌ర్వాత ఏమైందంటే!

Tollywood: టాలీవుడ్ న‌టుడు అవ‌స‌రాల శ్రీ‌నివాస్.. నాని హీరోగా తెర‌కెక్కిన అష్టా చ‌మ్మా సినిమాతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే ఊహాలు గుస గుస‌లాడే సినిమాతో ద‌ర్శ‌కుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇందులో నాగ‌శౌర్య హీరోగా న‌టించారు. కాగా ప్ర‌స్తుతం ఆయ‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. త‌న ద‌గ్గ‌ర మూడేళ్లుగా ప‌నిచేస్తున్న కో డైరెక్ట‌ర్‌ను త‌న ఆఫీస్‌నుంచి బ‌య‌ట‌కు గెంటేశారు. దీంతో ఆ కో డైరెక్ట‌ర్ కోపంతో ఓ సెల్ఫీ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఆ వీడియోలో ఇండ‌స్ట్రీలో అవ‌స‌రాల శ్రీ‌నివాస్ అనే ఆర్టిస్ట్ క‌మ్ డైరెక్ట‌ర్ ఉన్నాడుగా అత‌ని ద‌గ్గ‌ర నేను గ‌త మూడేళ్లుగా ప‌నిచేస్తున్నాను..

Avasarala srinivas latest

నేను ఎలాంటి త‌ప్పు చేయ‌క‌పోయినా ఈ రోజు న‌న్ను అంద‌రి ముందు నిల‌బెట్టి తిట్టి ఆఫీస్ నుంచి న‌న్ను బ‌య‌ట‌కు పంపించేశాడు.. ఒక్క‌టంటే ఒక్క త‌ప్పు కూడా లేదు నా ద‌గ్గ‌ర‌.. అత‌ని నిజ స్వ‌రూపం మీకు చూపిస్తా రండి అంటూ అవ‌స‌రాల శ్రీ‌నివాస్ నిజ‌స్వ‌రూపాన్ని చూపించాడు. దీంట్లో అవ‌స‌రాల శ్రీ‌నివాస్ బ‌ట్ట‌త‌లతో క‌నిపించాడు.. ఈ వీడియో చూసిన వారంతా షాక్ అయ్యారు.. కానీ ఇది మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగానే చేసారంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్స్ పెడుతున్నారు నెటిజ‌న్స్‌. ఆయ‌న న‌టిస్తున్న నూటొక్క జిల్లాల అంద‌గాడు సినిమా ప్ర‌మోష‌న్స్‌ను డిఫ‌రెంట్‌గా ప్లాన్ చేసి ఉంటార‌ని అంద‌రూ అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్‌, దిల్ రాజు నిర్మిస్తుండ‌గా.. రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ‌‌