Kangana-Rgv: “త‌లైవి”పై ఆర్‌జీవి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు‌.. ధీటుగా కంగనా రీట్వీట్‌!

Kangana-Rgv: వివాదాస్ప‌ద డైరెక్ట‌ర్ ఎవ‌రు అంటే ట‌క్కున చెబుతారు ఆర్‌జీవి రాంగోపాల్ వ‌ర్మ అని. వివాదాల రాజుగా సినీ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే బాలీవుడ్ లేడీ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ వివాదాల రాణిగా గుర్తింపు సంపాదించుకున్నది. వీరిద్ద‌రు ట్వీట్లు చేసుకుంటే ఆ కిక్కే వేర‌ప్పా అన్న‌ట్లు నెటిజ‌న్స్‌కు ఉంటుంది. ఈ క్ర‌మంలో వీరు సోష‌ల్ మీడియాలో వేదిక‌గా ఒక‌రిపై ఒక‌రు ట్వీట్లు చేసుకున్నారు.. కానీ ఈ ట్వీట్లు తిట్టుకున్న‌ట్లు ఉన్నాయా? లేక ప్ర‌శంస‌లు కురిపించే విధంగా ఉన్నాయా? అని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్స్ బుర్ర‌లు పాడు చేసుకుంటున్నారు. ఇంత‌కీ ఆ ట్వీట్లు ఏంటీ అనుకుంటున్నారా?.. కంగ‌నా ర‌నౌత్ న‌టించిన తాజా చిత్రం త‌లైవి ట్రైల‌ర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

Thalaivi

ఈ ట్రైల‌ర్‌ను చూసిన వ‌ర్మ త‌న‌దైన శైలిలో ట్వీట్ చేశాడు. త‌లైవి ట్రైల‌ర్ అద్భుతంగా ఉంది. ఈ ట్రైల‌ర్‌ను జ‌య‌లలిత స్వ‌ర్గం నుంచి చూసి థ్రిల్‌గా ఫీలవుతుందేమో అని.. కంగ‌నా సూప‌ర్ స్పెష‌ల్ గా ఉందంటూ.. కొన్ని సీన్స్‌ల్లో కంగ‌నా ప‌రిధి దాటి వెళ్ల‌పోతోంద‌ని వాటితో తాను ఏకీభ‌వించ‌నంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు ఆర్‌జీవి. ఇక ఆర్‌జీవి ట్వీట్ స్పందించిన కంగనా.. వ‌ర్మ‌తో తాను ఏ విష‌యంలోనూ ఏకీభ‌వించ‌క‌పోవ‌డం అనేది ఉండ‌ద‌ని చెప్పింది. ఆయ‌నంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని.. చాలా విష‌యాల్లో వ‌ర్మ అభినందిస్తాన‌ని.. ఇగో ప్ర‌పంచంలో వ‌ర్మ హ‌ర్ట్ కాలేడు.. ఆయ‌న ఏ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకోడని.. త‌న ట్వీట్‌పై కూడా వ‌ర్మ సీరియ‌స్‌గా తీసుకోడ‌ని.. ఏదైనప్ప‌టీకీ త‌న‌కు కాంప్లిమెంట్ ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు అంటూ ట్వీట్ చేసింది కంగ‌నా.