చిరంజీవి V/S వెంకటేష్.. ఈ సమరంలో గెలుపెవరిది?

సమ్మర్‌లో ఇద్దరు స్టార్ హీరోలు సమరానికి రెడీ అయ్యారు. సై సై అంటూ బక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధమైపోయారు. ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండటంతో.. సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ పోరులో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

CHIRU AND ACHARYA

ఆ ఇద్దరు సీనియర్ హీరోలు ఎవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా మే 13న విడుదల కానుండగా.. నారప్ప మే 14న రిలీజ్ కానుంది. ఇలా ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలు అటూఇటూగా ఒకేసారి విడుదల అవుతుండటంతో… ఈ రెండు సినిమాల మధ్య పోటీ నెలకొంది. దీంతో ఈ రెండు సినిమాల్లో ఏది ఎక్కువ హిట్ అవుతుందనే ఆసక్తి సినీ ప్రేక్షకుల్లో నెలకొంది.