ఆచార్య రిలీజ్ డేట్ వచ్చేసింది

టాలీవుడ్‌లో సినిమాల జాతర మొదలైంది. లాక్‌డౌన్ వల్ల గత ఏడాది ఆగిపోయిన సినిమాలన్నీ ఈ ఏడాది రిలీజ్‌ కానున్నాయి. గత రెండు రోజులుగా వరుస పెట్టి మేకర్స్ రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి-సక్సెస్‌పుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. ఈ ఏడాది మే 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారింగా ప్రకటించారు.

ACHARYA RELEASE MAY 13TH

ఇప్పటికే విడుదలై ఆచార్య టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. రాంచరణ్ వాయిస్ ఓవర్, చిరంజీవి డైలాగ్‌తో పాటు ఫైట్ సీన్లు అద్భుతంగా ఉన్నాయి. మణిశర్మ అందించిన మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. టీజర్ ఒక రేంజ్‌లో ఉండటంతో.. సినిమాపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రాంచరణ్ కూడా లాంగ్ లెన్త్ క్యారెక్టర్‌లో నటిస్తుండటంతో.. సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయింది. ఈ ఏడాది భారీ సినిమాలు విడుదల అవుతుండటంతో.. ఈ ఏడాది అంతా తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.