బరితెగించిన నటుడు. బహిరంగ ప్రదేశంలో నగ్న ప్రదర్శన

మోడల్, నటుడు మిలింద్ సోమన్ నగ్నంగా బీచ్‌లో పరిగెత్తిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నవంబర్ 4న తన పుట్టినరోజు సందర్భంగా గోవాలోని ఒక బీచ్‌లో దుస్తులు లేకుండా మిలింద్ ఫొటోలు దిగాడు. ఈ ఫొటోలను అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇవి కాస్త వైరలయ్యాయి.

నగ్నంగా సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసినందుకు ఐటీ చట్టంలోని సెక్షన్ 67, ఐపీసీ సెక్షన్ 294 కింద గోవా పోలీసులు కేసు నమోదు చేశారు.

మిలింద్ వివాదాల్లో చిక్కుకోవడం ఇది తొలిసారి కాదు. 1955లో బాలీవుడ్ నటి మధు సాప్రేతో కలిసి అతడి చేసిన కండోమ్ యాడ్ పెద్ద దుమారం రేపింది. నటీనటులు ఇలా అసభ్యకరంగా ప్రవర్తిసూ ఎప్పుడూ వివాదాల్లో ఉంటారు. ఇటీవల నటి పూనం పాండే అసభ్యకరంగా వీడియో చిత్రీకరించినందుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.