అనుష్క గురించి మీకు తెలియని విషయాలు

హీరోయిన్ అనుష్క శెట్టి ఇవాళ తన 39వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా స్వీటీ అనుష్క గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

అనుష్క 1981, నవంబర్ 7న కర్ణాటకలో జన్మించింది. ఆమె అసలు పేరు స్వీటీ శెట్టి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత అనుష్కనే స్వయంగా తన పేరును మార్చకుంది. సినిమాల్లోకి రాకముందే యోగ టీచర్‌గా స్వీటీ పనిచేసింది. సూపర్ సినిమా కోసం పూరీ జగన్నాథ్ ఒక కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు అనుష్క కంటపడింది. దీంతో సినిమాల్లో నటిస్తావా అని అనుష్కను పూరీ అడగ్గా.. దానిని ఆమె కూడా ఒప్పుకుంది.

దీంతో 2005లో విడుదలైన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచమైన స్వీటీ.. ఆ తర్వాత ఇక వెనక్కి చూసుకోలేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ తెలుగులో టాప్ మోస్ట్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక బాహుబలి సినిమాలోని దేవసేన పాత్రతో అనుష్క ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది.

తమిళంలో విడుదలైన సింగం, సింగం 2 సినిమాలతో కోలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది. అటు తెలుగులోనూ.. ఇటు తమిళంలోనూ అనుష్కకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.