అష్టదిగ్భంధనంలో సైరా?

దాదాపు 270 కోట్ల భారీ బడ్జట్ తో పాన్ ఇండియాన్ సినిమాగా తెరకెక్కిన సైరా సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. మెగాస్టార్ తో పాటు అన్ని ఇండస్ట్రీల స్టార్స్ నటిస్తూ ఉండడంతో సైరా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య వస్తున్న సినిమాకి నేషనల్ వైడ్ సోలో రిలీజ్ దొరుకుంతుంది అనుకుంటే బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ ప్రతి ఇండస్ట్రీలో సినిమాలని రిలీజ్ కి రెడీగా పెట్టారు. ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది కోలీవుడ్ గురించి. తమిళనాట మంచి మార్కెట్ ఉన్న హీరో ధనుష్, తన లక్కీ డైరెక్టర్ వెట్రిమారన్ తో కలిసి చేస్తున్న నాలుగో సినిమా అసురన్. ఈ కలయికలో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయ్యింది కాబట్టి సినీ అభిమానుల్లో అసురన్ సినిమాపై పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఈ మూవీ అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకి రానుంది. జీవి ప్రకాష్ నటించిన 100% లవ్ రీమేక్ 100% కాదల్ సినిమార్ సినిమా కూడా ఈ నెల 4న రిలీజ్ కాబోతోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా వాయిదా పడుతూ అక్టోబర్ 4కి ఫిక్స్ అయ్యింది. ఈ రెండు సినిమాల రిలీజ్ తో తమిళనాట సైరా సినిమాకి థియేటర్స్ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది.

ఇక హిందీ విషయానికి వెళ్తే, సైరా సినిమాకి ఉన్న ఏకైక పోటీ… సరైన పోటీ వార్ సినిమా మాత్రమే. ఇండియన్ మిషన్ ఇంపాజిబుల్ రేంజులో తెరకెక్కిన వార్ సినిమాలో సమఉజ్జిలు టైగర్ ష్రాఫ్, హ్రితిక్ రోషన్ కలిసి నటిస్తూ ఉండడంతో యాక్షన్ సినిమాలని ఆదరించే బాలీవుడ్ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడు వార్ చూస్తామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ వార్ సినిమాపై అంచనాలని పెంచాయి. ఇప్పుడున్న హైప్ కి పాజిటివ్ టాక్ కూడా తోడైతే బాక్సాఫీస్ దగ్గర వార్ సినిమాని ఆపడం చాలా కష్టం. ఫస్ట్ డే సైరాకి మంచి థియేటర్స్ వచ్చినా దాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటేనే లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంది. లేదంటే హ్రితిక్, టైగర్ ఫామ్ లో ఉన్న హీరోలు కాబట్టి లాంగ్ రన్ లో వారికే ఎక్కువ థియేటర్స్ కేటాయించేయడం పెద్దగా ఆశ్చర్యపరిచే విషయమేమీ కాదు.

తెలుగులో సైరాతో పాటు రిలీజ్ అవుతున్న ఏకైక సినిమా చాణక్య, గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ రెండు సినిమాలు వేరు వేరు జానర్స్, పైగా సైరాకి చాణక్యకి దసరా సెలవలు కలిసి రానున్నాయి. సైరా స్థాయిలో ఆ సినిమా వసూళ్లు రాబట్టుకుంటే, చాణక్య కూడా దాని రేంజ్ వసూళ్లు రాబట్టుకోగలదు. సో ఎటు చూసిన తెలుగులో సైరా సినిమాకి అడ్డు కనిపించట్లేదు. ఇవి చాలవన్నట్లు ఇండియన్ మల్టీప్లేక్స్ లో ఇంగ్లీష్ సినిమా దాడి చేయడానికి రెడీగా ఉంది. రాఫెల్ ఫోనిక్స్ హీరోగా నటిస్తున్న జోకర్ సినిమాపై ఏ సెంటర్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. వార్నర్ బ్రదర్స్ రిలీజ్ చేస్తుండడంతో జోకర్ కి ఇండియాలో మంచి రిలీజ్ వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమాల లిస్ట్ చూస్తే సైరా సినిమా అష్టదిగ్బంధనంలో ఉందా అనే అనుమానం రాక మానదు. అయితే కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి… లేడీ సూపర్ స్టార్ తలైవి నయనతార ఉన్నారు కాబట్టి థియేటర్స్ ని నిలబెట్టుకోగలిగితే మాత్రం సైరా తమిళనాడులో మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. అలాగే బాలీవుడ్ లో స్టార్స్ కే స్టార్ బిగ్ బి ఉన్నాడు, పై చిరుకి అక్కడ మంచి పేరే ఉంది సో హిందీలో కూడా సైరాకి వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఇక తెలుగు గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది మెగాస్టార్ పేరు చాలు ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లడానికి. థియేటర్స్ ని లాంగ్ రన్ లో నిలబెట్టుకోవడమే సైరా ముందున్న అతిపెద్ద టాస్క్. చరణ్ అది మాత్రం చేయగలిగితే ఎన్ని అడ్డంకులు వచ్చిన సైరా సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడం ఖాయం. 12 కోట్ల తెలుగు ప్రజలు సైరా కోసం ఎదురు చూస్తున్నారు. రికార్డులు ఉంటే రాసిపెట్టుకోండి అక్టోబర్ 2 పూర్తి అయితే ఎన్ని సెంటర్స్ లో ఏ రికార్డు లేచిందో అర్ధమవుతుంది.