రాజకీయాల కోసం వేగం పెంచారు…

దాదాపు 23 ఏళ్ల తర్వాత విశ్వనటుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కలిసి చేస్తున్న సినిమా భారతీయుడు 2. గతంలో వచ్చిన భారతీయుడు సినిమాలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సేనాపతి పాత్రలో కనిపించిన కమల్ హాసన్, బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలే సృష్టించాడు. ఈ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు భారతీయుడు 2 సినిమాని తెరకెక్కిస్తున్నారు. 200 కోట్ల భారీ బడ్జట్ తో రూపొందనున్న ఈ సినిమాకి బడ్జట్ ఇష్యూస్ రావడంతో ప్రాజెక్ట్ డిలే అయ్యింది. అన్ని సమస్యలు తీరిపోవడంతో శంకర్, భారతీయుడు2 షూటింగ్ ని మళ్లీ మొదలు పెట్టారు.

ఇప్పటి వరకూ కమల్, కాజల్, రకుల్, సిద్దార్థ్ పై సీన్స్ తెరకెక్కించిన శంకర్, కమల్ కోరిక మేరకు భారతీయుడు 2 షూటింగ్ ని వేగవంతం చేయబోతున్నాడు. 2021లో తమిళనాట ఎలెక్షన్స్ ఉండడంతో కమల్ వాటికి సన్నద్ధమవుతున్నాడు. ఈ కారణంగానే భారతీయుడు 2 షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్రణాళిక రచిస్తున్నారు. సోషల్ ఇష్యూస్ పై ఫైట్ చేసే భారతీయుడు 2లాంటి సినిమా ఎలక్షన్స్ ముందు రిలీజ్ కాబోతుండడం కమల్ హాసన్ కి బాగా కలిసొచ్చే అవకాశం ఉంది.