మూడు దశాబ్దాల తర్వాత… మళ్లీ అదే పాత్రల్లో

సరిగ్గా 30 ఏళ్ల క్రితం 1989లో ఇద్దరూ కొడుకు దిద్దిన కాపురం మూవీలో తెలుగు తెరపై విజయ్ శాంతి, మహేశ్ బాబు తల్లీ కొడుకులుగా కనిపించి మెప్పించారు. కొడుకు దిద్దిన కాపురం సినిమాలో బాల నటుడుగా మహేష్, ఆ తర్వాత సూపర్ స్టార్ అయ్యాడు. లేడీ సూపర్ స్టార్ గా ఉన్న విజయశాంతి, రాజకీయాలకి పరిమితం అయ్యింది. మళ్లీ మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు విజయశాంతితో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీలో నటిస్తున్నాడు. సినీ జీవితచక్రం అలాంటిది. చక్రంలా అవకాశం ఇలా గిర్రున తిరిగి వచ్చిందని మహేష్ బాబు అలనాటి ఫోటోతో రీసెంట్ గా చేసిన ఒక ట్వీట్ కూడా అందరినీ ఆకట్టుకుంది.

రాజకీయాల్లో బిజీ అయిపోయి సినిమాలకి దూరంగా ఉన్న విజయ శాంతి, 13 ఏళ్ల తర్వాత మళ్లీ మహేష్ మూవీ సరిలేరు నీకెవ్వరు కోసం మేకప్ వేసుకున్నారు. మహేష్ ఆర్మీ ఆఫీసర్ అజయ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని అందరికీ తెలుసు కానీ మహేశ్ ట్వీట్ చూసిన తర్వాత మాత్రం ఇద్దరూ తల్లీ కొడుకులుగా కనిపించనున్నారని డిసైడ్ అయిపోయారు. మరి మూడు దశాబ్దాల తర్వాత ఆన్ స్క్రీన్ తల్లీ కొడుకులుగా వీళ్ల మధ్య ఎలాంటి సీన్స్ ఉంటాయి, అవి ఎంత బాగా వర్కౌట్ అవుతాయి అనేది తెరపైనే చూడాలి.