లక్ష్మీ సమేత తారక రాముడు… తిరిగొచ్చాడు

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న భారీ బడ్జట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్. టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, ఎన్టీఆర్ మొదటిసారి కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా బల్గెరియాలో మొదలైన లాంగ్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్స్ ని షూట్ చేశారు. యంగ్ టైగర్, రియల్ టైగర్ తో ఫైట్ చేసే సీన్ సినిమాలో ఒక హైలైట్ గా మిలిగిలిపోతుందట. దాదాపు నెల రోజుల పాటు జరిగిన షెడ్యూల్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ తో సహా ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతితో సహా రిటర్న్ అయ్యారు.

బల్గెరియా నుంచి రిటర్న్ అయిన ఎన్టీఆర్ సతీసమేతంగా నేడు విమానాశ్రయంలో కనిపించాడు. ట్రిమ్ చేసిన బియర్డ్, మెలితిప్పిన మీసంతో ఉన్న ఎన్టీఆర్ ని చూసిన నందమూరి అభిమానులు ఖుషి అవుతున్నారు. ఎన్టీఆర్ ఫొటోస్ బయటకి వచ్చి చాలా రోజులు కావడంతో, తారక్ అప్డేట్ కోసం వెయిట్ చేసిన ఫ్యాన్స్ ఈ లేటెస్ట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక ట్రిపుల్ ఆర్ నెక్స్ట్ షెడ్యూలు త్వరలో మొదలుకానుంది, ఇందులో రామ్ చరణ్ పాల్గొనే అవకాశం ఉంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని వంటి ప్రముఖ నటులు నటిస్తుండగా, వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.