స్టార్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్న నితిన్ హీరోయిన్

బాపు బొమ్మ ప్రణీత బాటలో నడుస్తూ నితిన్ హీరోయిన్‌ యామీ గౌతమ్‌ కూడా చడీచప్పుడు లేకుండా పెళ్లి పీటలెక్కింది. తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం చిత్రాల్లో కనిపించిన ఆమె చివరిసారిగా నితిన్‌ సరసన ‘కొరియర్‌ బాయ్‌ కల్యాణ్‌’లో నటించిన యామి బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఆదిత్యతో మూడు ముళ్లు వేయించుకుని, ఏడడుగులు నడిచింది. కోవిడ్‌ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నేడు(శుక్రవారం) వీరి పెళ్లి జరిగింది.

ఈ విషయాన్ని యామీ గౌతమ్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించింది. వైవాహిక బంధంలోకి అడుగు పెట్టామంటూ భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్‌ చేసింది. అయితే, పెళ్లికొడుకు ఆదిత్య మరెవరో కాదు, ‘ఉరి: ద సర్జికల్‌ స్ట్రైక్‌’ డైరెక్టర్‌.. ప్రస్తుతం ఇతడు విక్కీ కౌశల్‌ హీరోగా ‘ద ఇమ్మోర్టల్‌ అశ్వత్థామ’ సినిమా తీస్తున్నాడు.