పుష్ప ఐటమ్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ

అల్లు అర్జున్ సినిమా అంటేనే ఊపు తెచ్చే సాంగ్స్ ఉంటాయి. ముఖ్యంగా సుకుమార్ అల్లు అర్జున్ సినిమా అన్నా, ఈ ఇద్దరికీ దేవి శ్రీ ప్రసాద్ కలిసినా థియేటర్స్ లో విజిల్స్ తో టాప్ లేచిపోద్ది. ఆర్య నుంచి మొదలుపెడితే రంగస్థలం వరకూ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కలిసినా… హీరో మ్యూజిక్ డైరెక్టర్ కలిసినా ఆ ఆల్బమ్ చార్ట్ బస్టర్ అవ్వడం గ్యారెంటీ అండ్ ప్రతి మూవీలో ఐటెం సాంగ్ పక్కా ఉండాల్సిందే… అది హిట్ అవ్వాల్సిందే. అంతటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్ పుష్ప మూవీతో మరోసారి రిపీట్ కాబోతుంది.

పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా ఒక ఐటెం సాంగ్ ని దేవి రెడీ చేస్తున్నాడట. ట్రెండ్ సెట్ చేయడంలో దిట్ట అయిన ఈ ముగ్గురు పుష్ప ఐటెం సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీని దించడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఇంతకీ ఐటెం సాంగ్ లో ఏ భామ మెరువబోతుందో అనే కదా మీ డౌట్, హిందీలో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్న దిశా పటానీ పుష్పలో అదిరిపోయే మాస్ డాన్స్ నంబర్ కి స్టెప్పులేసేందుకు రంగం సిద్దమవుతుంది. బన్నీ స్టెప్స్ కి బాలీవుడ్ పాపా తట్టుకుంటుందో లేదో కానీ ఈ కాంబినేషన్ మాత్రం స్క్రీన్ పైన చాలా కొత్తగా ఉండబోతుంది.