డ్రంక్ డ్రైవ్ టెస్ట్ లో దొరికి, కోర్ట్ మెట్లు ఎక్కిన ప్రిన్స్…

సెలెబ్రెటీ స్టేటస్ ఎంజాయ్ చేసే వాళ్లు పబ్లిక్ లోకి వచ్చే అప్పుడు, సమాజంలో తిరిగే అప్పుడు జాగ్రతగా ఉండాలి. ముఖ్యంగా వీకెండ్ పార్టీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవేమి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తూ చిక్కుల్లో పడుతుంటారు. పైగా లైమ్ లైట్ లో ఉన్న వాళ్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో దొరుకుతున్నారు. మద్యం సేవిస్తూ డ్రైవింగ్ చేయడం, తప్పతాగి తిరగడం తప్పని చెప్తున్నా… ఎవరికైనా ప్రమాదం జరుగుతుంది అని ప్రభుత్వాలు మీడియా ఛానళ్లు మొత్తుకుంటున్నా ఇవేమి పట్టించుకోకుండా, ప్రతి శనివారం ఎవరి ఒకరు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో దొరుకుతూ ఉంటారు. అలా ఈ వీక్ లో లిస్ట్ లో చేరిన సెలెబ్రిటీ… ప్రిన్స్. బస్ స్టాఫ్, రొమాన్స్ లాంటి చిత్రాలతో సహా బిగ్ బాస్ సీజన్ 1లో కూడా కనిపించిన హీరోప్రిన్స్, ఈనెల 24వ తేదీన బాచుపల్లిలో విఎన్ఆర్ కాలేజీ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయాడు. పోలీసులు ప్రిన్స్ ని ఈ రోజు కోర్టులో హాజరు పరచగా, కూకట్ పల్లి కోర్టు ప్రిన్స్ కి జరిమానా విధించింది. ఈ వీక్ డ్రంక్ డ్రైవ్ లో దొరికిన మరో ఆర్టిస్ట్ సుశాంత్. కూకట్ పల్లి 4 వ మెట్రో పాలిటన్ స్పెషల్ కోర్టు ఆర్టిస్ట్ సుశాంత్ కు ఐదువేల రూపాయల జరిమానా విధించింది.