ప్రొమోషన్స్ కాదు తిరునాళ్లనే మొదలుపెట్టాడు

సూపర్ స్టార్ మహేశ్ బాబు, సరిలేరు నీకెవ్వరూ టీజర్ తో ప్రొమోషన్స్ ని కాదు ఏకంగా తిరునాళ్లనే మొదలుపెట్టాడు. పూల మాలలు, పెద్దపెద్ద దండాలు, భారీ విగ్రహాలు, ఊరేగింపులు అన్ని తిరునాళ్లలోనే ఉంటాయి. సరిలేరు నీకెవ్వరూ తిరునాళ్లని కూడా ఘట్టమనేని అభిమానులు ఈ రేంజులోనే మొదలుపెట్టారు. వచ్చాడయ్యో సామీ అంటూ టీజర్ తోనే సంచలన రికార్డ్స్ సృష్టిస్తున్నారు. ఒక వీడియో ఈరోజు వైరల్ అయితేనే, రేపు కనిపించకుండా పోతుంటే… 72 గంటలుగా టీజర్ ని యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో నిలబెట్టడం ఘట్టమనేని అభిమానులకి మాత్రమే సాధ్యం అయ్యింది.

ఇక్కడికే అయిపోలేదు, సినిమా రిలీజ్ అయ్యే అప్పుడు థియేటర్ల దగ్గర కటవుట్ పెడితే కిక్కు ఏముంటది అనుకున్నారో ఏమో కానీ రిలీజ్ కి నెలన్నర ముందే భారీ కటవుట్ లు లేచాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల టీజర్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తున్న మహేశ్ ఫ్యాన్స్, హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద 81 అడుగుల భారీ మహేష్ బాబు కటౌట్‌ను పెట్టారు. టీజర్ సక్సస్ సెలెబ్రేట్ చేసుకోవడానికి పెట్టిన ఈ కటవుట్, సినిమా విడుదల వరకూ అలాగే ఉంటుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లాంటి ఏరియాలో సినిమా రిలీజ్ కన్నా 50 రోజుల ముందే కటవుట్ లేయడం, అది రిలీజ్ వరకూ కంటిన్యూ అవ్వడం ఇదే మొదటిసారి. ఇదే జోష్ రిలీజ్ వరకూ కంటిన్యూ చేస్తే, ఘట్టమనేని ఫ్యాన్స్ మహేశ్ కి కెరీర్ బెస్ట్ కాదు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.