ఆరడుగుల అందం, జేమ్స్ బాండ్ గన్నులా ఉంది…

ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్స్, ఫేడ్ అవుట్ అవుతున్న హీరోయిన్స్ అందరూ రకరకాల ఫోటోషూట్స్ చేస్తూ నెటిజెన్స్ ని ఖుషి చేస్తుంటారు. ఈ కేటగిరీల్లో హాట్ హాట్ ఫోటోలు పెడుతూ ఇన్స్టా ఫ్యామిలీని అలరిస్తున్న హీరోయిన్ సాక్షి చౌదరి. అల్లరి నరేష్ నటించిన జేమ్స్ బాండ్ సినిమాలో హీరోయిన్ గా సాక్షి చౌదరి చేతిలో ప్రస్తుతం సినిమాలు లేవు. మంచి హైట్, అంతకన్నా ముందు మంచి ఫిజిక్ సాక్షి చౌదరి సొంతం. మంచు మనోజ్ నటించిన పోటుగాడు సినిమాలో కూడా నటించిన సాక్షి చౌదరి, ఆ తర్వాత అరడజను చిత్రాలు చేసింది. ఎంత అందం ఉన్నా అదృష్టం, అవకాశం కలిసి రాకపోవడంతో సాక్షి కెరీర్ ఆల్మోస్ట్ డైలమాలో ఆగిపోయింది.

అవకాశాలు లేకపోవడం కారణమో లేక అందం ఉంది చూపిస్తే తప్పేంటి అనుకుందో ఏమో కానీ సాక్షి చౌదరి, ఇన్స్టాగ్రామ్ లో సెగలు పుట్టిస్తోంది. హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫాలోవెర్స్ కి ట్రీట్ ఇస్తున్న సాక్షి రీసెంట్ గా గోల్డ్ కలర్ నైట్ గౌన్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.