Sohel: చిరంజీవి ఇంట్లో బిగ్‌బాస్ ఫేం సోహేల్‌.. కార‌ణం ఏంటో తెలుసా!

Sohel: మెగాస్టార్ చిరంజీవి నివాసానికి నిన్న బిగ్‌బాస్-4 స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ సోహేల్ వెళ్లారు. చిరుతో ఫోటో దిగ‌డ‌మే కాకుండా ఆయ‌న‌ కుటుంబ స‌భ్యుల‌తో కూడా ఫోటోలు దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు సోహేల్‌. బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జున ఇంటికి ఇటీవ‌లే వెళ్లి సోహేల్ ఆయ‌న‌ను కలిసిన విష‌యం తెలిసిందే. అయితే బిగ్‌బాస్‌-4 సీజ‌న్ ఫైన‌ల్‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చిన చిరంజీవి..

chiru with sohel

Sohel సోహేల్ న‌టిస్తున్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా అతిథిగా వ‌స్తాన‌ని చిరంజీవి తెలిపారు. అలాగే సోహేల్‌కు చిరంజీవి త‌న భార్య సురేఖ‌తో బిర్యానీ వండించి మ‌రీ సోహేల్‌కు పంపించారు. ఈ నేప‌థ్యంలోనే చిరు ఇంటికి సోహేల్ వ‌చ్చాడు. చిరంజీవి భార్య సురేఖ గారితో పాటు ఆయ‌న త‌ల్లి అంజనాదేవి గారితో Sohel సోహేల్ ఫోటోలు దిగారు. దీనికి సంబంధించి ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.