చరిత్రను వక్రీకరిస్తున్నారు.. RRR ఎన్టీఆర్ పాత్రపై భీమ్ మనవడి ఆరోపణలు

ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRRపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన రెండు టీజర్లు ఇప్పటికే అంచనాల డోస్ ని కూడా మరింత పెంచాయి. అయితే సినిమాపై అప్పుడే వివాదాలు అలుముకుంటున్నాయి. కొమురం భీమ్ మనవడు సోన్ రావ్ ఎన్టీఆర్ చేసిన భీమ్ పాత్రపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

మా హీరో గురించి పరిశోధన సమాచారం కోసం దర్శకుడు మరియు రచయితలు మమ్మల్ని సంప్రదించినట్లయితే, మేము వారికి సరైన రీతిలో సహకారాన్ని అందించేవాళ్ళం. కానీ వారు పాత్రను వక్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. భీమ్ గిరిజనుల భూమి, నీరు మరియు ఇతర వనరుల కోసం పోరాడారు. అలాంటి వ్యక్తిని ఒక మైనారిటీ చెందిన కమ్యూనిటీ సభ్యుడిగా చూపించడం వక్రీకరణ తప్ప మరొకటి కాదని అన్నారు. ముస్లింగా కనిపించిన భీమ్ పాత్రను సినిమాలో చూపించవద్దని చెబుతూ అలా చేస్తే తప్పకుండా సినిమాను అడ్డుకుంటామని భీమ్ మనవడు ఆరోపించారు