అఫీషియల్: దర్శకేంద్రుడి పెళ్లి సందDలో అతనే హీరో..

దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు పెళ్లి సందడి కథను మళ్ళీ కొత్తుగా రీమేక్ చేయడానికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. దగ్గరుండి ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కనున్న కొత్త పెళ్లి సందDని గౌరీ రోనాంకి దర్శకత్వం వహించనున్నారు. శ్రీకాంత్ కుమారుడు రోషన్ ఈ శృంగారభరితమైన కుటుంబ ఎంటర్టైనర్లో ప్రధాన పాత్ర పోషించనున్నట్లు ఇదివరకే కొన్ని వార్తలు వచ్చాయి.

ఇక ఆ వార్తలు నిజమేనని మేకర్స్ రోషన్ యొక్క లేటెస్ట్ లుక్ విడుదల చేశారు. చూస్తుంటే రోషన్ ఈ సారి సరికొత్తగా ఆకట్టుకునేలా ఉన్నాడని అనిపిస్తోంది. కొంతకాలం క్రితం నిర్మాల కాన్వెంట్లో ప్రధాన పాత్ర పోషించిన రోషన్ ఇప్పుడు పెళ్లి సందడితో అలరించబోతున్నాడు. ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూట్ త్వరలో మొదలవుతుంది. MM కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆర్కా మీడియా వర్క్ బ్యానర్ లో రూపొందుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.