సంక్రాంతి తర్వాత మొదలుపెట్టనున్న కమల్

కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో భారతీయుడు 2 సినిమా రానున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ అయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారు. గతంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవ్వగా.. సెట్లో అగ్ని ప్రమాదం జరగడంతో మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత లాక్‌డౌన్ రావడంతో షూటింగ్ మొదలుపెట్టలేదు. ఇప్పుడు షూటింగ్‌లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. త్వరలో భారతీయుడు 2 షూటింగ్‌ను మొదలుపెట్టాలని నిర్మాతలు భావించారు.

kamalhasaan

సంక్రాంతి తర్వాత షూటింగ్‌ను ప్రారంభించే అవకాశముంది. వచ్చే ఏడాది మధ్యలో తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. కమల్ కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముంది. దీని వల్ల భారతీయుడు 2 షూటింగ్ మళ్లీ ఆగిపోయే అవకాశముంది. ఆ లోపు షూటింగ్ దాదాపు పూర్తి చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.

ముందుగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాలని నిర్మాతలు భావించారు. కానీ లాక్‌డౌన్ వల్ల షూటింగ్‌లు ఆగిపోవడంతో నిర్మాతలు తీవ్ర నష్టపోయారు. దీంతో ఈ సినిమా బడ్జెట్‌ను భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. బడ్జెట్ విషయానికి సంబంధించి గత కొద్దిరోజులుగా శంకర్, నిర్మాతల మధ్య చర్చలు జరిగాయి. బడ్జెట్ తగ్గించుకుంటేనే షూటింగ్ తిరిగి ప్రారంభిస్తామని మేకర్స్ చెప్పారట. దీంతో బడ్జెట్‌ను శంకర్ భారీగా తగ్గించినట్లు సమాచారం.