మాస్టర్ రిలీజ్ డేట్ ఫిక్సయింది

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ‘మాస్టర్’ సినిమా విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇందులో విజయ్ సేతుపతి విలన్‌గా నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో విజయ్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటించింది. తెలుగులో కూడా విజయ్‌కు భారీ క్రేజ్ ఉంది.

master

అందువల్ల తెలుగులోనూ ఈ సినిమా విజయం సాధించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక ఈ సినిమా తెలుగు రైట్స్‌కు భారీ డిమాండ్ నెలకొంది. వాస్తవానికి ఈ సినిమా మార్చిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఎట్టకేలకు థియేటర్లు ఓపెన్ కావడంతో రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ను సంపాదించుకుంది. దీంతో ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు అవాస్తవమని ఇటీవల మేకర్స్ ప్రకటించారు.