చిరంజీవి టైటిల్‌తో మహేష్ సినిమా

మహేష్-వంశీ పైడిపల్లి కాంబోలో వచ్చిన ‘మహర్షి’ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు అభిమానుల కోరిక తీరబోతోంది. మహేష్-వంశీ పైడిపల్లి కాంబోలో మరో సినిమాకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘స్టేట్ రౌడీ’ అనే టైటిల్‌ కన్పామ్ అయినట్లు సమాచారం.

maheshbabu

చిరంజీవి హీరోగా వచ్చిన ‘స్టేట్ రౌడీ’ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే టైటిల్‌తో మహేష్ సినిమా చేయడం ఆసక్తికరంగా మారింది. ఇందులో మహేష్ బాబు పక్కా మాస్ రౌడీ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ‘సర్కారువారి పాట’ సినిమాలో మహేష్ నటిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది.

వచ్చే ఏడాదిలో ‘సర్కారువారి పాట’ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ సినిమా చేస్తాడనే వార్తలొచ్చాయి. కానీ రాజమౌళితో సినిమా ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. వంశీ పైడిపల్లితో సినిమా చేసిన తర్వాతే రాజమౌళి సినిమా ప్రారంభం అవుతుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మహేష్‌కు వంశీ పైడిపల్లి కథ చెప్పగా.. మహేష్ కూడా ఓకే చెప్పాడట.