ఎన్నో మారాయి ఆ ఒక్కటి తప్ప- బెల్లంకొండ సాయి శ్రీనివాస్

యంగ్ హీరోల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా తన హార్డ్ వర్క్ తో అభిమానులని సొంతం చేసుకున్న సాయి శ్రీనివాస్, రాక్షసుడు సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఎంత ట్రోలింగ్ వచ్చినా ఏ రోజు నెగటివ్ గా రెస్పాండ్ అవ్వని ఈ హీరో, అన్నింటికీ నవ్వుతూనే సమాధానం ఇస్తాడు.

ప్రస్తుతం అల్లుడు అదుర్స్ సినిమా చేస్తున్న సాయి శ్రీనివాస్ సోషల్ మీడియాలో తన కొత్త లుక్ లో ఉన్న ఫోటోని పోస్ట్ చేశాడు. రెండు లుక్స్ లో ఉన్న సాయి శ్రీనివాస్, ఈ ఇయర్ లో ఎంతో మారింది కానీ ఫేస్ పైన తన నవ్వు మాత్రమే చేరగలేదని కోట్ చేశాడు. క్లీన్ షేవ్ అండ్ బియర్డ్ లుక్ లో కనిపించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నవ్వడానికి ఎప్పుడూ ఒక కారణం ఉంటుంది. అది మాత్రం గుర్తు పెట్టుకోండని ట్వీట్ చేశాడు.