కోలీవుడ్ క్లాసిక్ రీమేక్ లో ఐశ్వర్య రాజేష్

కౌశల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దెగ్గరైన బ్యూటీ ఐశ్వర్య రాజేష్. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని, క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉండే సినిమాలని మాత్రమే చేసే ఐశ్వర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ టక్ జగదీశ్. శివ నిర్వాణ నాని కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీతో ఐశ్వర్య తెలుగు మార్కెట్ ని సెట్ చేసుకోవాలని చూస్తోంది. తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీ గా ఉన్న ఐశ్వర్య రాజేష్, ఒక తమిళ క్లాసిక్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది.

లెజండరీ డైరెక్టర్ భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన #MunthanaiMudichu సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. 1983లో రిలీజ్ అయినా ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని ఇప్పుడు కే.భాగ్యరాజ్ రీమేక్ చేస్తున్నాడు. ఏవీఎమ్ ప్రొడక్షన్స్, జే.ఎస్.బి ఫిల్మ్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో శశి కుమార్ హీరోగా నటిస్తున్నాడు. దాదాపు 37 ఏళ్ల తర్వాత రీమేక్ కాబోతున్న ఈ మూవీలో నటిస్తున్నట్లు ఐశ్వర్య రాజేష్ స్వయంగా అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ తో ఉన్న ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.