బిగ్ బాస్ హౌజ్ నుంచి గంగవ్వని తప్పిస్తారా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో ఫస్ట్ వీక్ ట్రెమండస్ టీఆర్పీని సొంతం చేసుకుంది. తెలుగులో మోస్ట్ ఆడియన్స్ ని గ్యాదర్ చేస్తున్న బిగ్ బాస్ షో రెండో వారంలోకి ఎంటర్ అయ్యింది. మొదటివారం డైరెక్టర్ సాయి కిరణ్ ఎలిమినేట్ అవ్వగా, ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ప్రవేశ పెట్టారు. అఖిల్, అభిజీత్, హారిక, మోనాల్ మధ్య జరుగుతున్న లవ్ ట్రాక్ కి వ్యూవర్స్ బాగా అట్రాక్ట్ అయ్యారు. దీంతో షో బాగా క్లిక్ అయ్యింది, ముఖ్యంగా యూత్ మోనాల్ ఏ టైములో ఎవరితో ఉంటుంది? అభితో ఉంటే అఖిల్ ఎలా ఫీల్ అవుతున్నాడు? అఖిల్ తో ఉంటే అభి ఎలా ఫీల్ అవుతున్నాడు అనే క్యూరియాసిటీతో షో జరుగుతుంది.

టీవీలోనే కాకుండా నెట్ లో కూడా మంచి బజ్ క్రియేట్ చేసిన బిగ్ బాస్ 4లో ఇప్పుడు రెండో వారం ఎలిమినేషన్ సమయం వచ్చేసింది. ఇప్పుడున్న ప్రిడిక్షన్స్ ప్రకారం హైయెస్ట్ ఓట్లు సాధించి గంగవ్వ సేఫ్ అవ్వగా, కరాటే కళ్యాణి సాయి కిరణ్ అఖిల్ డేంజర్ లో ఉన్నారు. కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అందరూ అనుకుంటూ ఉండగా, గంగవ్వ తనంతగా తాను వెళ్లి బిగ్ బాస్ హౌజ్ వాతావరణం తనకి పడలేదని ఇంటికి వెళ్లిపోతానని కన్ఫెస్ చేసింది. బిగ్ బాస్ మానేజ్మెంట్ గంగవ్వ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేస్తే ఈ వారం రెండు ఎలిమినేషన్లు ఉండే అవకాశం ఉంది.