సిఎం రేవంత్ రెడ్డి తో బాలయ్య భేటీ

ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ని నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ కలిశారు. రేవంత్ రెడ్డి సిఎం అయ్యాక బాలయ్య ఆయనను ఇది రెండవ సారి. గతంలో ఒకసారి సినీ బృందంతో కలిసి భేటీ అయ్యారు. ఇప్పుడు మరోసారి బసవతారకం హాస్పిటల్ ట్రస్ట్ సభ్యులతో కలిసి భేటీ అయ్యారు. అయితే వారు దేని గురించి ఆ భేటీ అనేది పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. కేవలం బసవతారకం ట్రస్ట్ గురించి మాట్లాడుకున్నారు లేదా రాజకీయాల గురించి కుడా మాట్లాడుకున్నారు అనే విషయం పై విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. వీరు ఇద్దరు ఎన్నికల తరువాత, ఎన్నికల ఫలితాల ముందు ఇలా భేటీ కావడం వెనుక ఉన్న కారణం ఏంటో ఆలోచించాల్సిందే.