పది రోజుల ముందే సోషల్ మీడియాలో బిగిల్ దివాలి

ఇళయదళపతి విజయ్, యుంగ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ అంటేనే కోలీవడ్ బాక్సాఫీస్ రికార్డులు గల్లంతవుతాయి. ఇప్పటి వరకూ రెండు సినిమాలు చేసిన ఈ కాంబినేషన్ ఒక ఇండస్ట్రీ హిట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు మూడో సారి కలిసి ఈ అట్లీ విజయ్ బిగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావలి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. రిలీజ్ సమయం దగ్గర పడడంతో ప్రొమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్ బిగిల్ ట్రైలర్ రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేసింది. అక్టోబర్ 12న సాయంత్రం 6గంటలకి బిగిల్ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ కాంబినేషన్ లో వచ్చిన లాస్ట్ సినిమా మెర్సల్ ట్రైలర్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ మెర్సల్ ట్రైలర్ రికార్డ్స్ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆ స్థాయిలో బిగిల్ ట్రైలర్ రికార్డులు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

Bigil Trailer Announcement

తెలుగులో ఈ సినిమాని విజిల్ పేరుతో డబ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కి సన్నిహితుడైన మహేశ్ కోనేరు, బిగిల్ తెలుగు రైట్స్ ని కొన్నాడు. తెలుగు నుంచి పెద్ద సినిమాలేవీ దీపావళికి రిలీజ్ లేదు కాబట్టి ఈ టపాసుల పండగకి విజయ్ విజిల్ మోతమోగించేలా ఉన్నాడు. రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాలో దళపతి విజయ్ ఒక పాట కూడా పాడడం విశేషం. మెర్సల్ లో టాక్సులు, హాస్పిటల్స్ గురించి డిస్కస్ చేసి నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న విజయ్ అట్లీలు విజిల్ సినిమాలో క్రీడల్లో జరుగుతున్న రాజకీయాలని డిస్కస్ చేయబోతున్నారు.