ముఖ్తేశ్వరం కుస్తీ పోటీల్లో కళ్యాణ్ రామ్ కుమ్మేస్తున్నాడు

కెరీర్ స్టార్టింగ్ నుంచి మాస్ సినిమాలు మాత్రమే చేస్తున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎంత మంచి వాడవురా. ఫ్యామిలీ సినిమాల డైరెక్టర్, నేషనల్ అవార్డ్ సినిమా తీసిన సతీష్ వేగేశ్న తెరకెక్కితున్న ఈ సినిమాని శివలెంక ప్రసాద్ నిర్మిస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ తోనే మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్న ఎంత మంచి వాడవురా సినిమా టీజర్ ని దసరా కానుకగా రిలీజ్ చేశారు.

టైటిల్ కి తగ్గట్లుగానే టీజర్ ని మంచి విలేజ్ మాంటేజ్ షాట్ తో డీసెంట్ గా ఓపెన్ చేసిన సతీష్ వేగేశ్న, హీరో ఇంట్రడక్షన్ ని కొత్తగా ప్లాన్ చేశాడు. ఎప్పటిలాగే ఒక పెద్ద ఫ్యామిలీనే చూపించిన దర్శకుడు, సీనియర్ యాక్టర్ విజయ్ కుమార్ తో మొదలుపెడితే, తనికెళ్ల భరణి, నరేష్, మెహ్రీన్ వరకూ ఒక్కొక్కరితో హీరోని మంచి వాడు అని చెప్పిస్తూ, ఆ డైలాగ్స్ మధ్యలో హీరో రౌడీలని కొట్టే మాంటేజ్ వేస్తూ టీజర్ ని డిజైన్ చేసిన విధానం బాగుంది. ఎండ్ లో టి.ఎన్.ఆర్ కనిపించి అందరూ మంచి వాడు అంటున్నారు ఇలా కొడుతున్నావ్ ఏంట్రా అనగానే… కళ్యాణ్ రామ్ ఫేస్ రివీల్ చేశారు. రాముడు కూడా మంచి వాడేరా, రావణుణ్ణి ఏసేయాలా అనే డైలాగ్ చెప్పిన కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపించాడు. ఈ ఒక్క డైలాగ్ హీరో క్యారెక్టరైజేషన్ చెప్పేసింది.

తమ్ముడు ఎన్టీఆర్, బృందావనం సినిమాలో క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా అని చెప్పి క్లాస్ లోనే మాస్ చూపించాడు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా అదే ఫాలో అవుతున్నట్లున్నాడు. తారక్ కి బృందావన్ ఎలాగో, కళ్యాణ్ రామ్ కి ఎంత మంచి వాడవురా సినిమా నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే హీరోని ఒక్కో పేరుతో అంటే శివ, ఆచార్య, బాలు, సూర్య, రిషి అని ఒక్కో ఆర్టిస్ట్ ఒక్కో పేరుతో ఎందుకు పిలిచారు. ముక్తేశ్వరం ఊరి కుస్తీ పోటీల్లో మంచోడు అయిన కళ్యాణ్ రామ్ కి ఏం పని? అతను ఎవరిని కొడుతున్నాడు అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి. రిలీజ్ డేట్ ని కూడా తెలివిగా టీజర్ లోనే చూపించిన సతీష్ వేగేశ్న, సంక్రాంతికి వస్తున్నామని చెప్పేశాడు.